Lyrics
రచన - అన్నమాచార్య
రాగం - సాళంగనాట
పలుకు దేనెల తల్లి పవళించెను |
కలికి తనముల విభుని గలసినది గాన ||
నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర
పగలైన దాక జెలి పవళించెను |
తెగని పరిణతులతో తెల్లవారినదాక
జగదేక పతి మనసు జట్టి గొనె గాన ||
కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి
బంగారు మేడపై బవళించెను |
చెంగలువ కనుగొనల సింగారములు దొలక
అంగజ గురునితోడ నలసినదిగాన ||
మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై
పరవశంబున దరుణి పవళించెను |
తిరు వేంకటాచలా ధిపుని కౌగిట గలసి
అరవిరై నును జెమలు నంటినదిగాన ||
paluku denela talli pavaḷincenu |
kaliki tanamula vibhuni galasinadi gaana ||
niganigani momupai neṟulu gelakula jedara
pagalaina daaka jeli pavaḷincenu |
tegani pariṇatulato tellavaarinadaaka
jagadeka pati manasu jaṭṭi gone gaana ||
koṅgu jaarina meṟugu gubba lolayaga daruṇi
baṅgaaru meḍapai bavaḷincenu |
ceṅgaluva kanugonala siṅgaaramulu dolaka
aṅgaja gurunitoḍa nalasinadigaana ||
muripempu naṭanato mutyaala malagupai
paravaśambuna daruṇi pavaḷincenu |
tiru veṅkaṭaacalaa dhipuni kaugiṭa galasi
aravirai nunu jemalu naṇṭinadigaana ||
Playlist : Telugu Bhakthi Songs of Lord Vishnu / Krishna | శ్రీమహావిష్ణు తెలుగు భక్తి పాటలు
No comments:
Post a Comment