Friday, August 2, 2019

అలర చంచలమైన Alara chanchalamaina | అన్నమాచార్య కీర్తన Annamacharya Keerthana




Lyrics:
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ ఉయ్యాల
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భవంబు దెలిపె నీ ఉయ్యాల||

ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ ఉయ్యాల
పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె ఉయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె ఉయ్యాల||

మేలు కట్లయి మీకు మేఘమణ్డలమెల్ల మెరుగునకు మెరుగాయె ఉయ్యాల
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె ఉయ్యాల
పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు ఉయ్యాల
వోలి బ్రహ్మాణ్డములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల||

కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ ఉయ్యాల
కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె ఉయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె ఉయ్యాల||

Alara chanchalamaina athma landunda nee
alavaatu sesey nee uyyala
Palu maaru uchvasa pavana mandhunda nee
Bhavambhu thelipe nee uyyala                                         
Uyyala..Uyyala..Uyyala..Uyyala

Udhaystha sailambu lonarakambammulaina
Vudumandalamu noche uyaala
Adhana aakasa padhamu adda dhoolambaina
Akhilambu ninde nee uyyala
Uyyala..Uyyala..Uyyala..Uyyala

Padilamuga vedamulu bangaru cherulai
Pattaverapai thoche uyyala
Vadhalakitu dharma devatha peetamai migula
Varnimpa arudaye uyyala
Uyyala..Uyyala..Uyyala..Uyyala

Melu katlayi miku meghamandala mella
Merugunaku merugaye vuyyala
Neela sailamuvanti ni meni kanthiki
Nijamaina thodavaye vuyyala
Uyyala..Uyyala..Uyyala..Uyyala

Kamalasanadhulaku kannulaku pandugai
Ganuthimpa narudaye uyyala
Kamaniya murthy Venkata sailapathi neeku
Kaduvedukai unde uyyala

Playlist : Telugu Bhakthi Songs of Lord Vishnu / Krishna | శ్రీమహావిష్ణు తెలుగు భక్తి పాటలు

No comments:

Post a Comment