Saturday, August 3, 2019

తులసీ దళములచే Tulasee dalamulache | త్యాగరాయ కీర్తన Thyagaraja Keerthana



The Most Beautiful Song on Lord Rama by Unnikrishnan

రాగం మాయామాళవగౌళ

Lyrics తులసి దలములచే సంతోషముగా పూజింతు పలుమారు చిరకాలము... పలుమారు చిరకాలము పరమాత్ముని పాదములను తులసి దలములచే సంతోషముగా పూజింతు సరసీ రుహపున్నాగ చంపక పాగాటల కురవక కరవీర మల్లిక సుగంధరాజ సుమముల్ ధరణివియొక పర్యాయము ధర్మాత్ముని... సాకేతపుర వాసుని శ్రీరాముని.. సాకేతపుర వాసుని శ్రీరాముని వర త్యాగరాజనుతుని తులసి దలములచే సంతోషముగా పూజింతు సంతోషముగా పూజింతు

Ragam  mayamalavagowla

English

Tulasi dalamulache santhoshamuga poojinthu

palumaru chirakalamu
palumaru chirakalamu paramaathmuni paadamulanu
Tulasi dalamulache santhoshamuga poojinthu

sarasi ruhapunnaga champaka paagaatalaku kuravaka
karaveera mallika sugandharaja sumamul
dharanivi yoka paryaayamu dharmathuneeee...
saketha puravasuni sriramuni
saketha puravasuni sriramuni vara thyagaraja suthuni

Tulasi dalamulache santhoshamuga poojinthu

Playlist : Telugu Bhakthi Songs of Lord Vishnu / Krishna | శ్రీమహావిష్ణు తెలుగు భక్తి పాటలు

Friday, August 2, 2019

పలుకు తేనెలతల్లి paluku tenela thalli | Beautiful song of Goddess Lakshmi | Annamacharya Keerthana


Lyrics రచన - అన్నమాచార్య రాగం - సాళంగనాట పలుకు దేనెల తల్లి పవళించెను | కలికి తనముల విభుని గలసినది గాన || నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర పగలైన దాక జెలి పవళించెను | తెగని పరిణతులతో తెల్లవారినదాక జగదేక పతి మనసు జట్టి గొనె గాన || కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి బంగారు మేడపై బవళించెను | చెంగలువ కనుగొనల సింగారములు దొలక అంగజ గురునితోడ నలసినదిగాన || మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై పరవశంబున దరుణి పవళించెను | తిరు వేంకటాచలా ధిపుని కౌగిట గలసి అరవిరై నును జెమలు నంటినదిగాన || paluku denela talli pavaḷincenu | kaliki tanamula vibhuni galasinadi gaana || niganigani momupai neṟulu gelakula jedara pagalaina daaka jeli pavaḷincenu | tegani pariṇatulato tellavaarinadaaka jagadeka pati manasu jaṭṭi gone gaana || koṅgu jaarina meṟugu gubba lolayaga daruṇi baṅgaaru meḍapai bavaḷincenu | ceṅgaluva kanugonala siṅgaaramulu dolaka aṅgaja gurunitoḍa nalasinadigaana || muripempu naṭanato mutyaala malagupai paravaśambuna daruṇi pavaḷincenu | tiru veṅkaṭaacalaa dhipuni kaugiṭa galasi aravirai nunu jemalu naṇṭinadigaana ||

Playlist : Telugu Bhakthi Songs of Lord Vishnu / Krishna | శ్రీమహావిష్ణు తెలుగు భక్తి పాటలు

లాలనుచు నూచేరు Lalanuchu Noocheru | అన్నమాచార్య కీర్తన Annamacharya Keerthana




Lyrics
లాలనుచు నూచేరు లలనలిరుగడల
బాలగండవీర గోపాలబాల.. ఉదుట గుబ్బల సరసము లుయ్యాల లూగ
పదరి కంకణరవము బహుగతులమ్రోగ వొదిగి చెంపల కొప్పు లొక్కింత వీగ
ముదురు చెమటల నళికములు తొప్పదోగ.. సొలపు తెలిగన్నుగవ చూపులిరువంక
మలయ రవళులకు బహుమాఱును బెళంక కొలది కోవిగములు క్రోలుమదనాంక
ములగ్రేణిసేయ రవములు వడిదలంక.. సరుస పదములు జంగ చాపుచేబాయ
గురులీల మీగళ్ళ గుచ్చెళ్ళరాయ కరమూలములు కాంతి కడుజాయజేయు
సరస నురుకుసుమ వాసనలెదురుడాయ.. కొలది నునుమేనుల కూనలసి యాడ
మెలకువతోనొకరొకరి మెచ్చి సరియాడ తలలూచి చొక్కి చిత్తరు బొమ్మలాడ
అలరి యెల్లరు మోహనాకృతులు చూడ.. లలిత తాంబూల రసకలితంబులైన
తళుకు దంతములు కెంపుల గుంపులీన మొలక వెన్నెల డాలు ముసురు కొనితోన
చెలగి సెలవుల ముద్దు చిరునవ్వులాన.. మలయ మారుత గతులు మాటికి జెలంగ
పలుకు గపురపు తావి పైపై మెలంగ పలుగానలహరి యింపుల రాల్గరంగా
బలసి వినువారి చెవి బడలిక దొలంగ.. లలనా జనాపాంగ లలిత సుమచాప
జలజలోచన దేవ సద్గుణ కలాప తలపు లోపల మెలగు తత్వప్రదీప
భళిర గండపరేశ పరమాత్మరూప laalanuchu noochaeru lalanalirugadala baalagandaveera gopaalabaala uduta gubbala sarasamu luyyaala looga padari kamkanaravamu bahugatulamroga vodigi chempala koppu lokkimta veega muduru chematala nalikamulu toppadoga solapu teligannugava choopuliruvamka malaya ravalulaku bahumaa~runu belamka koladi kovigamulu krolumadanaamka mulagraenisaeya ravamulu vadidalamka sarusa padamulu jamga chaapuchaebaaya guruleela meegalla guchchellaraaya karamoolamulu kaamti kadujaayajaeyu sarasa nurukusuma vaasanaledurudaaya koladi nunumaenula koonalasi yaada melakuvatonokarokari mechchi sariyaada talaloochi chokki chittaru bommalaada alari yellaru mohanaakrtulu chooda lalita taamboola rasakalitambulaina taluku damtamulu kempula gumpuleena molaka vennela daalu musuru konitona chelagi selavula muddu chirunavvulaana malaya maaruta gatulu maatiki jelamga paluku gapurapu taavi paipai melamga palugaanalahari yimpula raalgaramgaa balasi vinuvaari chevi badalika dolamga lalanaa janaapaamga lalita sumachaapa jalajalochana daeva sadguna kalaapa talapu lopala melagu tatvapradeepa bhalira gamdaparaesa paramaatmaroopa

Playlist : Telugu Bhakthi Songs of Lord Vishnu / Krishna | శ్రీమహావిష్ణు తెలుగు భక్తి పాటలు

అలర చంచలమైన Alara chanchalamaina | అన్నమాచార్య కీర్తన Annamacharya Keerthana




Lyrics:
అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసె నీ ఉయ్యాల
పలుమారు నుచ్ఛ్వాస పవనమందుండ నీ భవంబు దెలిపె నీ ఉయ్యాల||

ఉదాయాస్త శైలంబు లొనర కంభములైన వుడుమండలము మోచె నుయ్యాల
అదన ఆకాశపదము అడ్డౌదూలంబైన అఖిలంబు నిండె నీ ఉయ్యాల
పదిలముగ వేదములు బంగారు చేరులై పట్టి వెరపై తోచె ఉయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయె ఉయ్యాల||

మేలు కట్లయి మీకు మేఘమణ్డలమెల్ల మెరుగునకు మెరుగాయె ఉయ్యాల
నీల శైలమువంటి నీ మేనికాంతికి నిజమైన తొడవాయె ఉయ్యాల
పాలిండ్లు కదలగా పయ్యదలు రాపాడ భామినులు వడినూచు ఉయ్యాల
వోలి బ్రహ్మాణ్డములు వొరగువో యని భీతి నొయ్య నొయ్యనైరి వూచిరుయ్యాల||

కమలకును భూసతికి కదలు కదలకు మిమ్ము కౌగలింపగజేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హాస భావ విలాస మందంద చూపె నీ ఉయ్యాల
కమలాసనాదులకు కన్నుల పండుగై గణుతింప నరుదాయె ఉయ్యాల
కమనీయ మూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె ఉయ్యాల||

Alara chanchalamaina athma landunda nee
alavaatu sesey nee uyyala
Palu maaru uchvasa pavana mandhunda nee
Bhavambhu thelipe nee uyyala                                         
Uyyala..Uyyala..Uyyala..Uyyala

Udhaystha sailambu lonarakambammulaina
Vudumandalamu noche uyaala
Adhana aakasa padhamu adda dhoolambaina
Akhilambu ninde nee uyyala
Uyyala..Uyyala..Uyyala..Uyyala

Padilamuga vedamulu bangaru cherulai
Pattaverapai thoche uyyala
Vadhalakitu dharma devatha peetamai migula
Varnimpa arudaye uyyala
Uyyala..Uyyala..Uyyala..Uyyala

Melu katlayi miku meghamandala mella
Merugunaku merugaye vuyyala
Neela sailamuvanti ni meni kanthiki
Nijamaina thodavaye vuyyala
Uyyala..Uyyala..Uyyala..Uyyala

Kamalasanadhulaku kannulaku pandugai
Ganuthimpa narudaye uyyala
Kamaniya murthy Venkata sailapathi neeku
Kaduvedukai unde uyyala

Playlist : Telugu Bhakthi Songs of Lord Vishnu / Krishna | శ్రీమహావిష్ణు తెలుగు భక్తి పాటలు